సండ్రకు ప్రమోషన్..
posted on Oct 29, 2017 3:55PM

తెలుగుదేశం పార్టీలోని తన పదవులకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంతో నెక్ట్స్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.. తర్వాతి తెలుగుదేశం శాసనసభాపక్ష నేత పదవుల కోసం అందరిలో చర్చ మొదలైంది. ముఖ్యంగా రేవంత్ నిష్క్రమణతో అసెంబ్లీలో టీడీపీ గొంతు వినిపించే ఫ్లోర్ లీడర్ పదవి ఎవరికి దక్కుతుందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది శాసనసభ్యులుగా గెలిచారు. వారిలో 12 మంది అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. దీంతో నిన్నటి వరకు రేవంత్, సండ్ర, కృష్ణయ్య మిగిలారు.. వీరికి అసెంబ్లీలో నాయకుడిగా రేవంత్ వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా ఆయన రాజీనామా చేయడంతో టీడీఎల్పీ లీడర్‌గా సండ్ర వెంకట వీరయ్య నియమితులయ్యే అవకాశం ఉంది. మరో ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కూడా ఉన్నప్పటికీ.. ఆయన రాజకీయాలకు... టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో టీడీఎల్పీ పదవి సండ్రదేనని, ఈ మేరకు ప్రకటన వెలువడుతుందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.