సల్మాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష

 

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దోషి అని ముంబై సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. అతనికి 25 వేల జరిమానా, అయిదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. దీంతో అతనిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించే అవకాశముంది. పలువురు సినీ ప్రముఖులు సల్మాన్ కు సానుభూతి తెలిపారు. మరోవైపు సల్మాన్ ఖాన్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు పరిస్థితి అయోమయంలో పడింది. ప్రస్తుతం రూ. 200 కోట్ల ప్రాజెక్టులు సల్మాన్ చేతిలో ఉన్నాయి. ఆ సినిమాల పరిస్థితి ఏంటా అని నిర్మాతలు డైలమాలో పడ్డారు.