లోకేశ్ ఎఫర్ట్ ... స్మార్ట్ సిటీకి ఎన్నారైల సపోర్ట్

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం యువనేత పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్ ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్నారై తెలుగుదేశం లోకేశ్ కు ఘన స్వాగతం పలికింది. ఆంధ్రరాష్ట్రంలో ప్రభుత్వపరంగా ఏ హోదాలో లేని లోకేశ్ ఒక భాధ్యతాయుతమైన ఆలోచనతో తన వంతుగా ఆంధ్రరాష్ట అభివృద్ధికి కావలసిన సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఎలాగైనా ఆంధ్రరాష్టాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో  అమెరికాలోని అనేక పారిశ్రామిక వేత్తలతో, పెట్టుబడిదారులతో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. అనేక ఐటీ కంపెనీలు నెలకొల్పడానికి విశాకపట్నం అనువైనదిగా ఉంటుందని విశాఖను స్మార్ట్ సిటీగా మార్చాలని లోకేశ్ అన్నారు.

 

ఇందులో భాగంగానే ఆయన మంగళవారం ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలైన ఇమాజినేషన్ సంస్థ అధినేత యార్లగడ్డ కృష్ణగారిని, అంతేకాక వాణిజ్యవిభాగానికి చెందిన అసిస్టెంట్ సెక్రెటరీ అరుణ్ కుమార్, డైనమిక్ గ్లాస్ తయారీ సంస్థ సీఈఓ మురళీ రావు వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఈ సందర్భంగా వారు విశాఖపట్నంలో కూడా తమ సంస్థలను స్థాపించడానికి, అభివృద్ది చేయడానికి సహకరిస్తామని తెలిపారు. అంతేకాక లోకేశ్ కామర్స్ అసిస్టెంట్ సెక్రెటరీ అరుణ్ కుమార్ ను ఆంధ్రరాష్ట్రాన్ని ఒక తయారీకేంద్రం మార్చడానికి సహకరించాలని కోరామని, ఆంధ్రరాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని, పెట్టుబడులు అనువైన స్థలమని చెప్పామని చెప్పారు. యూఎస్ పెట్టుబడుల సహకారంతో ఆంధ్రప్రదేశ్ ను స్మార్ట్ సిటీ గా మలిచే విధానంపై చర్చించామన్నారు.

 

దీంతో లోకేశ్ 15 గంటలలో ఆరు సమావేశాలు, పలు రకాల పారిశ్రామికవేత్తలతో చర్చలు, జరిపినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దీంతో లోకేశ్ అమెరికా నుండి పెట్టుబడుదారులను తీసుకొస్తాడనే నమ్మకం ఏర్పడింది. రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న లోకేశ్ తెలుగుదేశం గర్వపడేలా చేస్తాడనే అందరూ ఆశిస్తున్నారు.