సాహితీ స్కామ్ రూ.3000 కోట్ల తేల్చిన సీసీఎస్

 

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాహితీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ భారీ రియల్ ఎస్టేట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాహితీ స్కాంపై సీసీఎస్  పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఈ స్కాంలో మొత్తం రూ.3000 కోట్లకు పైగా మోసం జరిగినట్లు సీసీఎస్ పోలీసులు తేల్చారు. ఈ కంపెనీ ఎండి సాహితీ లక్ష్మీనారాయణ ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో ప్రజలను ఆకర్షించి, అతి తక్కువ ధరలకు ప్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సాహితీ లక్ష్మీనారాయణను పోలీసులు గుర్తించారు. ఈ సాహితీ స్కాం పై మొత్తం 13 మంది నిందితు లపై అభియోగాలు నమోదు చేశారు. సాహితీ స్కాంలో ఇప్పటివరకు మొత్తం 64 కేసులు నమోదయ్యాయి. ఈ 64 కేసులపై సీసీఎస్ ప్రత్యేక బృందం విచారణ కొనసా గిస్తోంది. ఈ స్కాంలో భాగం గా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అత్యధికంగా మోసం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. 

ఈ ప్రాజెక్ట్ పేరుతోనే రూ.500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. శర్వాణి ఎలైట్‌కు సంబం ధించిన 17 కేసులు నమోదు కాగా, ఈ 17 కేసులపై ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులను ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించ కుండా, సాహితీ లక్ష్మీనారా యణ తన సొంత ప్రయోజ నాలకు వినియోగించినట్లు సీసీఎస్ విచారణలో వెల్లడైంది. ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి, ప్రజలను నమ్మించి మోసం చేసిన విధానం పైగా పలు ఆరోపణలు ఉన్నాయి.సాహితీ స్కాంలో ఇంకా పలు కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని సీసీఎస్ అధికారులు తెలిపారు. మిగిలిన కేసులపై దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని ఛార్జ్‌షీట్లు దాఖలు చేసే అవకాశముందని పేర్కొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu