టెస్టులకు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ

 

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత తరుపున టెస్ట్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు తనపై చూపిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతానని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ఇప్పటివరకు 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 4301 పరుగులు చేశాడు రోహిత్. 

ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2025 లో భాగంగా ముంబై జట్టు ప్లేయర్ గా ఉన్న కొనసాగుతున్నా రోహిత్ శర్మ తన ఆటలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంపై ఊహాగానాలు, చర్చలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. అయితే వాటిని బీసీసీఐ తోసిపుచ్చింది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ రోజు తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్  తీసుకుంటున్నట్లు హిట్ మ్యాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేశారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu