సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం పొడిగింపు
posted on May 7, 2025 7:31PM

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని కేంద్రం ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. నూతన సీబీఐ డైరెక్టర్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ పదవీకాలం పొడిగింపునకు అపాయింట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రవీణ్ సూద్ పదవీకాలం వాస్తవానికి ఈ నెల 24తో ముగియాల్సి ఉంది. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ గా తన పోలీస్ కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బళ్లారి, రాయచూర్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో మే 2023లో సీబీఐ డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.