బుర్ఖా తీసి చెక్ చేసే హక్కు ఉంది: మాధవిలత
posted on May 13, 2024 5:40PM
పోలింగ్ బూత్‌లో బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసు అంశం మీద హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత స్పందించారు. తాను హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్థిని అని... పైగా మహిళా అభ్యర్థిని అన్నారు. వారి ఫొటో ఐడెంటింటీని చెక్ చేసుకునే హక్కు తనకు ఉందన్నారు.
తాను చాలా వినమ్రతగా 'అమ్మా, మీ ఫేస్... ఫొటో ఐడీని చెక్ చేసుకోండి' అని వారిని రిక్వెస్ట్ చేశానని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఫేస్‌ను, ఫొటో ఐడీని చూశానన్నారు. రెండు బూత్‌లలో ఈవీఎంలను మార్చేశారని ఆరోపించారు. పోటీ చేసే అభ్యర్థిగా ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను తీసుకెళ్లి చూపించడానికి తనకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రెండు బూత్‌లలో మోసం చేస్తున్నారని.. దీనిపై ఎవరు మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేశారు.