తెలంగాణ బడ్జెట్ లోపాల పుట్ట

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నాడు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోపభూయిష్టంగా వుందని, ఇలాంటి బడ్జెట్‌ని ఎన్నడూ చూడలేదని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. శనివారం నాడు టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం సరైన న్యాయం చేయలేదని ఆరోపించారు. పేదలకు రావాల్సిన పెన్షన్లు తగ్గిపోయాయని చెప్పారు. సభలో ఒక సభ్యుడిని మాట్లాడనీయకుండా చేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని దయాకర్ రావు ఎద్దేవా చేశారు. ఇదిలా వుండగా తెలంగాణ శాసనసభ సమావేశాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీలా జరిగాయని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. శాసనసభలో కేసీఆర్ భజన చేయడానికి ఆయన వందిమాగధులు పోటీపడ్డారని రేవంత్ రెడ్డి అన్నారు.