రేషన్ బియ్యంతో వండిన అన్నం తిన్న రేవంత్ రెడ్డి
posted on Apr 6, 2025 2:30PM
.webp)
తెలంగాణలో రేషన్ బియ్యం దళారులు చేతుల్లో వెళ్లిపోతుంది. దీనికి ప్రధాన కారణం దొడ్డు బియ్యం. ఈ బియ్యం వండుకుని తినడానికి ఎవరూ ఆసక్తి కనబరచడంలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఈ నెల నుంచే రేషన్ షాపుల్లో సన్నబియ్యం సప్లయ్ చేస్తుంది. సన్న బియ్యం పంపిణీ చేస్తే బియ్యం దళారుల చేతుల్లో పడే అవకాశాల్లేవని పాలకుల అభిమతం. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని యోచిస్తుంది. మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు కాంగ్రేస్ పార్టీకి ఇచ్చి న అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. వాళ్ల ఇంట్లో భోజనం చేస్తున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లాలో ని సారపాక గ్రామంలో రేషన్ బియ్యంతో చేసిన అన్నాన్ని తిన్నారు. ఈ అన్నం తినడానికే ముఖ్యమంత్రి సారపాక గ్రామానికి వచ్చారు. తన హాయంలో పంపిణీ అవుతున్న రేషన్ బియ్యం ఎలా ఉన్నాయో చెక్ చేశారు. బియ్యం సన్నగా ఉన్నాయా, రుచిగా ఉందా అని రేవంత్ రెడ్డి తనకు అన్నం పెట్టిన కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. నేరుగా ముఖ్యమంత్రి మా ఇంట్లో భోజనం చేశాడని ఆ కుటుంబం ఉబితబ్బిబ్బవుతోంది.