తన కోరికను చెప్పిన రేవంత్...

 

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో తెలంగాణ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి.. విదేశీ పర్యటన మీద మీడియా సమావేశం జరుగుతున్న సమయంలోనే తన రాజీనామా లేఖను చంద్రబాబుకు అందించారు. అయితే ఈ లేఖలో రేవంత్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా ఎదుగుదలకు మీరు ఎంతో కృషి చేశారు.. తక్కువ సమయంలో మీరూ, పార్టీ నాకు గుర్తింపునిచ్చారు... టీడీపీతో విడపోవడం అంటే గుండెకోతతో సమానం అని అన్నారు. పార్టీ క్యాడర్ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది.. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే... కొంత మంది నేతలు కేసీఆర్ తో లాలూచీలు చేస్తున్నారని.. నన్ను దెబ్బకొట్టడం కోసం కేసీఆర్ వాళ్లకు తాయిలాలు ఇస్తున్నారని లేఖలో తెలిపారు.  తాను ఏ పార్టీలో ఉన్నా తెలంగాణలో టీడీపీ బ్రతికే ఉండాలని కోరుకుంటున్నాను అని లేఖలో పేర్కొన్నాను. అలాగే, టీ-టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలియజేశారట. మొత్తానికి.. పార్టీని వీడుతున్న ఇన్నాళ్లు పనిచేసిన పార్టీపై తన ఆఖరి కోరికని అధినేతకు తెలిపారు రేవంత్ రెడ్డి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu