రేవంత్ రెడ్డికి రేణుదేశాయ్ వేడుకోలు
posted on Apr 2, 2025 12:37PM
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన 400 ఎకరాల భూ వివాదంపై సినీ నటి, ఎపి డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తన ఇన్ స్టా గ్రాం వేదికగా స్పందించారు. . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ రిక్వెస్ట్ పెడుతూ వీడియో షేర్ చేశారు. తనకు 44 ఏళ్లు అని, రేపో మాపో చనిపోతానని ఈ 400 ఎకరాల్లో చెట్లను నరికి వేస్తే వచ్చే తరాలకు ఆక్సిజన్ దక్కదని పేర్కొన్నారు. ఆ భూమిని అలాగే వదిలేయాలని రేణుదేశాయ్ వేడుకున్నారు. ఆక్సిజన్ , నీళ్ల కోసం ఈ భూమి అవసరమని, అభివృద్ది కోసం అయితే మరో చోట వేలాది ఎకరాలు ఉన్నాయని రేణుదేశాయ్ వీడియోలో పేర్కొన్నారు. వన్య ప్రాణులు ఉన్న ఈ భూమిని అన్యాక్రాంతం చేయకూడదని ఆమె కోరారు.
రేణుదేశాయ్ మాటల్లో.. ‘‘నాకు రెండ్రోజుల క్రితమే సెంట్రల్ యూనివర్శిటీ భూముల గూర్చి తెలిసింది. కొన్ని విషయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నాను. నాకు 44 ఏళ్లు వచ్చేశాయి. రేపో మాపో చనిపోతాను. కానీ నా పిల్లలతో బాటు మనందరి పిల్లల భవిష్యత్ కోసం ఆక్సిజన్ అవసరమని , మాకు ఐటి పార్క్ , భారీ భవనాలు, వరల్డ్ క్లాస్ సదుపాయాలు కావాలి. అయితే అభివృద్ది 100 శాతం ముఖ్యం. అందులో అనుమానమే లేదు. కాని ఒక్క శాతం అవకాశం ఉన్నా ఆ భూమిని వదిలేయండి’’ అని రేణుదేశాయ్ చేసిన వేడకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.