రోటీకి మతం రంగు: ఉద్ధవ్
posted on Jul 24, 2014 10:24PM

‘రోటీ’ వివాదానికి కాంగ్రెస్ పార్టీ మతం రంగు పులుముతోందని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తమ పార్టీ పత్రిక సామ్నాలో విమర్శించారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో పనిచేసే ముస్లిం చేత 11 మంది శివసేన ఎంపీలు ఉపవాస వేళలో బలవంతంగా రోటీ తినిపించారన్న అంశం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ‘సర్వర్ ముఖం మీద మతం పేరు రాసి ఉంటుందా?’ అంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఎదురు దాడి చేశారు. తమ పార్టీ ఎంపీలను విమర్శించే ముందు ఢిల్లీలోని మహరాష్ట్ర సదన్‌లో మరాఠి సంస్కృతికి జరుగుతున్న అన్యాయం, అవమానం మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దృష్టి సారించాలని థాకరే సూచించారు. అనుకోకుండా జరిగిన ఘటనపై విచారణ అంటూ గోల చేస్తే, సీఎం చవాన్‌కి కూడా కూడా బలవంతంగా రోటీ తినిపించాల్సి ఉంటుందని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.