జగన్ పై ప్రసరిస్తున్న రామోజీ ‘ఉషాకిరణాలు‘
posted on Sep 26, 2015 6:10PM

రామోజీ, జగన్ భేటీ అలా జరిగిందో లేదో అప్పుడే జగతిపై ఉషాకిరణాలు ప్రసరించడం మొదలెట్టేశాయి. రామో-ఛీ అన్న నోటితోనే రామో-జీ అనడంతో ఈనాడు,ఈటీవీల్లో జగన్ పై వ్యతిరేక వార్తలు ఆగిపోయాయట, ఈ మేరకు ఈనాడు సిబ్బందికి రామోజీ నుంచి ఆదేశాలు వెళ్లిపోయాయట, అందుకే గతంలో ఎప్పుడూ జగన్ అవినీతి, కేసులపైనే తప్ప పాజిటివ్ వార్తలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఈటీవీలో జగన్ దీక్ష పరిణామాలు, వైసీపీ లీడర్స్ బైట్స్ ను బాగానే ఇస్తోంది. తెలుగుదేశం అధికారంలో ఉంటే ప్రతిపక్షాన్ని కూరలో కరివేపాకులా తీసిపారేసే ఈనాడు గ్రూప్ లో ఈ కొత్త వింతను చూసి జనం ముక్కున వేలేసుకుంటుంటే, భవిష్యత్ లో ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలోనని పొలిటికల్ లీడర్స్ గుసగుసలాడుకుంటున్నారు. టైమ్ బాబూ టైమ్ అంటూ మాట్లాడుకుంటున్నారు