బీస్ట్ మోడ్ లో రామ్ చరణ్.. RC16 లోడింగ్...

తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్' (Game Changer)ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రామ్ చరణ్ (Ram Charan).. 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. 

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న 'RC 16' కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నాడు. ఇప్పటిదాకా చరణ్ చేసిన పాత్రలకు భిన్నంగా, చాలా పవర్ ఫుల్ గా ఇందులో ఆయన పాత్ర ఉంటుందట. ఆ పాత్రకు తగ్గట్టుగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసే పనిలో చరణ్ పడిపోయాడు. తాజాగా సోషల్ మీడియాలో "బీస్ట్ మోడ్ ఆన్.. #RC16 లోడింగ్" అని పోస్ట్ పెట్టిన చరణ్.. ఓ ఫొటోని కూడా పంచుకున్నాడు. ఆ పిక్ లో చరణ్ ఫిట్ నెస్ కోచ్ కూడా ఉన్నాడు.