ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ లో పలు జల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ  శాఖ పేర్కొంది. మే 19 నుంచి మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలకు కురుస్తాయనీ, గంటకు 50 కిలో మీట్లర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కోస్లా, రాయలసీమలలో ఓ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. 

ఇలా ఉండగా నైరుతి రుతుపవనాలు ఒక రోజు ముందే అంటే మే 31 నాటికే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది దేశంలో ఎల్ నినో పరిస్థితులు ఉండవనీ, సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయనీ పేర్కొంది.