మళ్లీ దొరికిపోయిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తప్పులో కాలేశారు. తడబడ్డారో లేక అవగాహనా లోపమో తెలియదు కానీ పార్టీలకు దొరికిపోయారు. నిన్న మరణించిన మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అర్జున్ సింగ్‌కు సంతాపం తెలుపుతూ ఆయన హోదాను తగ్గించారు. ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్‌ మరణం తనకు ఎంతో బాధను కలిగించిందని వ్యాఖ్యానించారు. మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ భారత వాయుసేనలో ఫైవ్ స్టార్ ర్యాంక్..ఎయిర్‌ మార్షల్ అనేది త్రీ స్టార్ ర్యాంక్..అంతటి ఘనమైన హోదా కలిగిన అర్జున్ సింగ్‌ను ఎయిర్ మార్షల్‌గా సంబోధించడంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. కొద్దిరోజుల క్రితం లోక్‌సభ సభ్యుల సంఖ్యను తప్పుగా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్న ఆయన..దానికి కొద్దిరోజుల ముందు బెంగళూరులో ఇందిరా క్యాంటీన్‌లను ప్రారంభిస్తూ..వాటిని అమ్మ క్యాంటీన్‌గా పేర్కొని అప్రతిష్ట మూటకట్టుకున్నారు.