పూరి హార్ట్ కి సెన్సార్ రిపోర్ట్

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "హార్ట్ ఎటాక్" చిత్రం ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ నుండి "A" సర్టిఫికేట్ ను దక్కించుకుంది. లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్లో స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో నితిన్, ఆదాశర్మ జంటగా నటించారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.