కొలికిపూడి మాకొద్దంటూ  మంగళగిరిలో నిరసన

మొదటినుంచి వివాదాలకు కేంద్రబిందువైన కృష్ణా జిల్లా తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికి పూడి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.  శనివారం (మార్చి29) మంగళగిరిటిడిపి కార్యాలయానికి భారీ ఎత్తున టిడిపి శ్రేణులు తరలివచ్చాయి. అనేక పర్యాయాలు అధిష్టానం హెచ్చరిస్తున్నప్పటికీ కొలికి పూడి తన వైఖరి మార్చుకోలేదు. స్వంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. తిరువూరు నియోజకవర్గ టిడిపి నేత అలవాల రమేష్ రెడ్డిపై చర్య తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అల్టిమేటం ఇవ్వడం తాజాగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో మంగళగిరి టిడిపి కార్యాలయానికి టిడిపి కార్యకర్తలు చేరుకున్నారు. కొలికిపూడి మా కొద్దంటూ నినాదాలు చేశారు.