ఎపిలో భగ భగ 

 ఎపిలో ఎండలు మండిపోతున్నాయి.  మార్చి చివరి వారంనాటికే మునుపెన్నడూలేని ఊష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో సగటున 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ఎపిలోని 150  మండలాల్లో 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు దాటాయి. వాతావరణ శాఖ ఐఎండి ఈ వివరాలను వెల్లడించింది. నంద్యాల, కొమరోలు, కమలాపురంలలో 42 .5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 
ఎస్ కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లా రుద్రవరంలో 42 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది.