క‌డుపు కాకుండానే త‌ల్లైన ప్రియాంక చోప్రా.. స‌ర్‌ప్రైజ్ న్యూస్‌..

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌. వాల్డ్ ఫేమ‌స్ సెల‌బ్రెటీ క‌పుల్స్‌. రెండేళ్ల క్రితం ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నారు. నాన్‌స్టాప్‌గా న్యూస్‌లో ఉండేవారు. నిక్ ఫ్యామిలీతో ప్రియాంక చాలా ఈజీగా క‌లిసిపోయారు. ప‌లు ఫ్యామిలీ ఆల్బ‌మ్స్‌తో పాపుల‌ర్ అయ్యారు. అంతేనా. పెళ్లంటే ఇంతేనా? ఇంకేం లేదా? రెండేళ్లు అవుతోంది.. ఏం గుడ్‌న్యూస్ లేదా? అంటూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో తెగ కామెంట్లు పెట్టేశారు. ఆ ప్ర‌శ్న‌ల‌కు ప్రియాంక నుంచి నో రిప్లై. ఇప్పుడు స‌డెన్‌గా తాను త‌ల్లి అయ్యానంటూ పోస్ట్ పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అదేంటి.. ఇంత వ‌ర‌కూ ప్రెగ్నెంటే కాలేదు.. త‌ల్లి ఎలా అయింద‌బ్బా..అంటూ మ‌రింత ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు తెలిసింది.. క‌రోగ‌సీ అని. 

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ దంపతులు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రెండేళ్ల క్రితం దంపతులు అయిన ఈ జంట పిల్లల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే ఇప్పుడు తాము ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యమంటూ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. 

‘‘సరోగసీ విధానంలో మేం పండంటి బిడ్డకు జన్మనిచ్చాం. మాకెంతో సంతోషాన్నిచ్చిన ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ సమయం మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. కాబట్టి దయచేసి మా వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నాం’’ అంటూ నిక్‌, ప్రియాంకా  సోషల్‌ మీడియా వేదికగా కోరారు. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘కంగ్రాట్స్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

అయితే వీరికి పుట్టిన బిడ్డ ఆడ, మగ అనేది తెలియజేయలేదు. ఇన్‌స్టా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయగానే అభిమానులు, స్నేహితులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్‌’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్‌ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. వివాహమైన తర్వాత ఆమె లాస్‌ఏంజెల్స్‌లో సెటిలైంది. ప్రస్తుతం వరుస హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.