ఫలితాల రోజు వాటర్ తాగండి బ్రో!
posted on May 23, 2024 2:46PM
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీ సర్వనాశనం అయిపోవడం ఖాయమని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అలాగే కేంద్ర రాజకీయాల గురించి కూడా ఆయన తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలను కొంతమంది విమర్శిస్తున్నారు. ఇది సహజం. అయితే తన అంచనాలపై వస్తున్న విమర్శలకు ప్రశాంత్ కిషోర్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెరైటీ కౌంటర్ ఇచ్చారు. ‘‘శరీరానికి, మెదడుకు నీరు చాలా అవసరం. నా అంచనాలను విమర్శిస్తున్న వారు జూన్ 4వ తేదీన బాగా మంచినీరు తాగడం మంచిది.. ఎందుకంటే, ఆరోజు వచ్చే ఫలితాలను చూసి వాళ్ళ శరీరంలో నీరు ఆవిరైపోయే ప్రమాదం వుంది’’ అనే అర్థం వచ్చే విధంగా ఎక్స్.లో కామెంట్ పోస్ట్ చేశారు. ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రశాంత్ కిషోర్ తాను చెప్పినదానికి కట్టుబడి వుంటున్నారు. అంటే, మన జలగన్న ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్!