గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సాకారం కానుందా?

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దేశంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా వార్తలలో ఉన్న సంగతి తెలిసిందే. పెట్టుబడులు, పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ తరుణంలోనే  దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. విజయవాడ కార్పొరేషన్ ను విస్తరించి గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ గా చేయాలన్నదే ఆ ప్రతిపాదన. ఇందుకు విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న 74 గ్రామాలను   విలీనం చేసి.. గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్నదే ఆ ప్రతిపాదన. అమరావతికి ఆనుకుని ఉన్న నగరం విస్తరణ అత్యంత ముఖ్యమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

తాజాగా ఆ ప్రతిపాదనలో ఒక కదలిక వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం (డిసెంబర్ 25) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయనకు గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనను వివరించారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి తోడుగా, ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడను విస్తరించాలని విజ్ణప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.  వాస్తవానికి చాలా కాలంగా  గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశం పెండింగ్ లో ఉంది.

ఆ అంశాన్నే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి సత్వరమే విజయవాడ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తసుకోవాలని కోరారు. తక్షణమే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల మధ్య   ఆ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కేశినేని చిన్ని తెలిపారు. జీవీఎంసీపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని చిన్ని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu