హైడ్రామాకు నేటితో తెర

బీఆర్ఎస్ అసమ్మతి నేతలు పొంగులేటి, జూపల్లి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మార్గం సుగుమం అయ్యింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే వార్తలకు ఇక తెరపడనుంది.
కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై వీరిరువురు బుధవారం అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.  
బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పట్ల అసంతృప్తిని తొలుత పొంగులేటి ఒక్కరే ప్రకటించారు.  తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తోడయ్యారు. వీరిద్దరు కలిశాక తాము ఎటువైపు వెళ్లాలన్నదానిపై ఇద్దరి మధ్య అంతర్గత సమావేశాలు జోరుగా  సాగాయి. కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఆదివారం  జూపల్లి కలిశారు.ఇది కాజువల్ సమావేశమేనని జూపల్లి అంటున్నారు.తామిద్దరం పాత స్నేహితులమని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లిలు విలేకరులతో అన్నారు.30 ఏళ్లుగా స్నేహితులుగా కొనసాగుతున్నామని ఇరువురు నేతలు తమ అనుబంధాన్ని తెలిపారు.   పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరే విషయమై చాలా రోజుల నుంచి సస్పెన్షన్ నెలకొంది.  అదే సమయంలో ఇద్దరూ కలిసి పలువురు నేతలతో రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. వారం రోజుల క్రితం వీరికి బీఆర్‌ ఎస్ కే చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి జత కలిశారు. దీంతో ముగ్గురూ కలిసి టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవితో చర్చలు జరిపారు. ఈ 14న సంయుక్తంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గ్గురు నేతలు కాంగ్రె్‌సలోకి వెళ్లడమనేది అధికార బీఆర్‌ఎ్‌సకే కాకుండా బీజేపీకి కూడా నిరాశ కలిగిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఈ పరిణామం భవిష్యత్తులో తమకు బూస్ట్‌గా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్‌ గద్వాల జోగుళాంబ జిల్లాలో జరిపిన పర్యటనలో పాల్గొని ఆశ్చర్యపరిచారు. కేసీఆర్‌ వెంట పర్యటన ఆసాంతం ఉండడంతోపాటు గద్వాలలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. సభావేదికపై బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి కూర్చున్నారు. దీంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu