సంక్రాంతి సెలవులు.. ఏకంగా 9 రోజులు!
posted on Dec 27, 2025 1:31PM

సంక్రాంతి పండుగ ఈ సారి విద్యార్థులకు మరింత జోష్ ను మోసుకువచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు ఏకంగా 9 రోజులు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ అధికారికంగా ప్రకటన జారీ చేయకపోయినప్పటికీ.. అదే ఖాయం అన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా సంస్థలకు జనవరి 11 నుంచి 15 వరకూ సంక్రాంతి సెలవులను ప్రకటించింది.
అయితే జనవరి 10 రెండో శనివారం కావడం, భోగి పండుగ, జనవరి 14, సంక్రాంతి పండుగ జనవరి 15, కనుమ పండుగ జనవరి 16గా అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. సంక్రాంతి సెలవుల తేదీలను సవరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమౌతాయి. ఇక జనవరి 17 శనివారం కావడంతో ఆ రోజును కూడా సెలవుగా ప్రకటించి సంక్రాంతి సెలవులను జనవరి 18 వరకూ పొడిగించి, విద్యాసంస్థల పున: ప్రారంభం జనవరి 19 గా ప్రకటించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. దీంతో ఈ ఏడు సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి జనవరి 18 వరకూ అంటే 9 రోజులు ఖాయంగా కనిపిస్తోంది.