ప్రశాంతంగా పోలింగ్.. సీఈవో వికాస్ రాజ్

తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో  కలిసి వచ్చి సనత్ నగర్ లోని నారాయణ కాలేజీ పోలింగ్ బూత్ లో  ఓటు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. అక్కడక్కడా ఈవీఎంల సమస్య తలెత్తినా వెంటనే సరిచేస్తున్నామన్నారు. యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

ఎవరైనా సరే తాము ఓటు వేయాల్సిన పోలింగ్ బూత్ ను యాప్ లొకేషన్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. ఇక ఈ సారి ఓటింగ్ శాతం పెరుగుతుందన్న విశ్వాసాన్ని వికాస్ రాజ్ వ్యక్తం చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu