20 మంది స్మగ్లర్ల ఎన్‌కౌంటర్

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఎర్రచందనం స్మగ్లర్ల హవా ఆడింది ఆటగా పాడింది పాటగా నడించింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మగ్లర్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వందలాదిమంది స్మగ్లర్లను ఇప్పటి వరకూ అరెస్టు చేశారు. ఇదిలా వుండగా, మంగళవారం తెల్లవారుఝామున చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో 20 మంది స్మగ్లర్లను ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం నిర్విరామంగా కూంబింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారు ఝామున కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు మొదట రాళ్లతో దాడి చేసి అనంతరం కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపగా 20 మంది స్మగ్లర్లు మృతి చెందారు. చంద్రగిరి మండలం ఈతగుంట, ఈత పాకుల కోన పరిసర ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. శ్రీవారి మెట్టులో 11మంది, మంగాపురంలో 9మంది స్మగ్లరు హతమైనట్లు సమాచారం. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు కూడా గాయపడ్డారని తెలుస్తోంది.