కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం
posted on Nov 17, 2024 1:33PM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించటం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దపు ప్రచారం చేసింది. లక్షన్నర కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో ఈ ప్రాజెక్టు డ్యామేజి అయ్యింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే అంశాలలో కాళేశ్వరం చేరింది. కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చిందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి.. నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు