పిఎఫ్ ఐ చొర‌బాటు.. ఎన్ ఐ ఏ వైఫ‌ల్యామేనా? 

దేశంలో హింస‌కు విద్రోహులు భారీ ఏర్పాట్ల‌తో పూనుకోవ‌డం, ఇటీవ‌ల నిఘా సంస్థ‌ల ద‌ర్యాప్తుల్లో బ‌య‌ట ప‌డింది. ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలో భారీ పేలుళ్లు చేపట్ట‌డానికి పీఎఫ్ ఐ కుట్ర ప‌న్నింద న్న‌ది ద‌ర్యాప్తులో వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌ధాని మోదీ హ‌త్య‌కు కుట్ర ప‌న్నిన సంగ‌తి తెలిసిన కొద్ది రోజు ల‌కే బీజే పీ ఆర్ ఎస్ ఎస్ నేత‌లే ల‌క్ష్యంగా వ్యూహ ర‌చ‌న జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే  ఆ సంస్థకి సం బంధించి దేశంలో అనేక న‌గ‌రాల్లో ప‌ట్ట‌ణాల్లో ఎన్ ఐఏ ద‌ర్యాప్తు చేప‌ట్టి చాలామంది అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుంది 

నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పీఎఫ్ఐ రెక్కీ నిర్వహించింద‌ని తెలిసింది. నవరాత్రి ఉత్సవాల్లో భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పీఎఫ్ఐ హిట్‌ లిస్టులో దర్యాప్తు సంస్థ అధికారులు సైతం ఉన్న ట్టు సమాచారం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. సంబంధిత కార్యాల యాల దగ్గర భద్రతను పెంచారు.

కొద్దిరోజుల క్రితం అంటే బీహార్‌లోని పాట్నానగర పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు పీఎఫ్ ఐ కుట్ర పన్నిందని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐ ఏ) దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఏడాది జులై లో ప్రధాని మోదీ పాట్నా పర్యటన సందర్భంగా పీ ఎఫ్ఐ సభ్యులు దాడికి విఫల యత్నం చేశారని దర్యాప్తులో తేలింది. ప్రధానిపై దాడి చేసేందుకు పీ ఎఫ్ఐ పలువురు కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చింద‌ని వెల్లడైంది. ప్రధానితోపాటు యూపీలోని పలు వురు ప్రముఖులపై దాడికి పీఎఫ్ఐ మారణాయుధాలు కూడా సమకూర్చుకున్నారని తేలింది. ఎన్ఐఏ, ఈడీలు దేశ వ్యాప్తంగా  15 రాష్ట్రాల్లో సోదాలు జరిపి వంద మందిని అరెస్ట్ చేసింది.

ఇదిలా ఉండ‌గా, దేశ‌ర‌క్ష‌ణ బాధ్య‌తల విష‌యంలో బీజేపీ స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మ‌యింద‌ని, విదేశీ శ‌క్తు లు దేశంలో  స్లీప‌ర్‌సెల్స్‌తో దాడుల‌కు దిగే ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇవాళ ఏకంగా పీఎంను హ‌త‌మార్చేందుకు కుట్ర‌పూనే స్థాయిలో విస్త‌రించ‌డం భ‌యాందోళ‌న‌కు గురిచే స్తోంద‌ని  విరుచుకుప‌డ్డాయి. దేశంలో  ప్ర‌జాసంక్షేమంతో పాటు ప్ర‌జా ర‌క్ష‌ణ‌ విష‌యంలోనూ కేంద్ర ప్ర‌భు త్వం, హోంమంత్రిత్వ‌శాఖ‌ మ‌రింత చొర‌వ‌చూపాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని అంటున్నాయి.

దేశంలో అనేక ప్రాంతాల్లో పీ ఎఫ్ ఐ విస్త‌రించ‌డం దాడుల‌కు సిద్ధ‌ప‌డ‌టం కేవ‌లం ర‌క్ష‌ణ రంగ వైఫ‌ల్యం గానే చూడాల్సి వ‌స్తుంద‌ని,  చివ‌రి నిమిషాల్లో దాడులు చేసి  కొంద‌రిని అదుపులోకి తీసుకున్నంత మా త్రాన ఎంతో జాగ్త‌త్త‌లు తీసుకు న్న‌ట్లు కాద‌ని వివ్లేష‌కులు అంటున్నారు. విదేశీ సంబంధాలు, పాల‌నాప‌ర ప్ర‌గ‌ల్భాలు ప్ర‌చారం చేసుకోవ డంతో కాలం గ‌డిపేయ‌డం కాకుడా వాస్త‌వంగా దేశంలో శాంతిభ‌ద్ర‌త‌ల అంశాన్ని ప‌ట్టించుకోవాల‌సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని విప‌క్షాలు కేంద్రాన్ని హెచ్చ‌రిస్తున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu