సినీ, టీవీ నటి రేష్మి రెండో పెళ్ళి

 

ప్రముఖ మలయాళ మాజీ హీరోయిన్, ప్రస్తుతం కేరెక్టర్ పాత్రలు ధరిస్తూ టీవీలో నటిస్తున్న రేష్మి సోమన్ రెండో పెళ్ళి చేసుకుంది. గోపీనాథ్ అనే ప్రవాస భారతీయుడిని గురువాయూర్ దేవాలయంలో ఆమె వివాహం చేసుకుంది. ఈ వివాహ కార్యక్రమంలో వధూవరుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. తాను ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు, టీవీ సీరియళ్ళను పూర్తి చేసిన అనంతరం నటనకు గుడ్‌బై చెప్పనున్నానని, తన భర్తతో కలసి విదేశాలకు వెళ్ళిపోవాలన్న ఆలోచనలో వున్నానని రేష్మి ఈ సందర్భంగా చెప్పింది. రేష్మి గతంలో టీవీ దర్శకుడు నజీర్ని పెళ్ళి చేసుకుంది. ఆమె ఆ వివాహాన్ని పెద్దలను ఎదిరించి మరీ చేసుకుంది. అయితే ఆ తర్వాత ఈ జంట మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు.