వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నారు. ఇక పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు.  గత కొన్ని రోజులుగా  వైరల్ ఫీవ‌ర్ తో ఇబ్బంది పడిన పవన్ కల్యాణ్  కోలుకున్నారు. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే  మంగ‌ళ‌గిరి వ‌చ్చారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఆయన మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు.

నాలుగో విడత పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న సమయంలోనే ఆయన అస్వస్థతతో ఇబ్బంది పడ్డారు. బందర్ లో పార్టీ నేతల సమావేశం జరుగుతుండగా తీవ్రమైన నడుం నొప్పితో ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లి పోయిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత వైరల్ ఫీవర్ బారిన పడటంతో హైదరాబాద్ వెళ్లి అక్కడే చికిత్స చేయించుకున్నారు. పీవర్ తగ్గగానే తిరిగి మంగళగిరి చేరుకున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో తాజా రాజ‌కీయ పరిస్థితులు, వారాహి విజ‌య‌యాత్ర ఐదో విడ‌త, జ‌న‌సేన‌,తెలుగుదేశం పార్టీల ఉమ్మ‌డి స‌మ‌న్వ‌య క‌మిటీలో చ‌ర్చించాల్సిన అంశాలు,  రాష్ట్రంలో రైతాంగం  స‌మ‌స్య‌ల‌పై చర్చించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu