పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదు.. మురళీమోహన్



భూసేకరణ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మురళీ మోహన్ స్పందించారు. రాజధాని ప్రాంతంలో తాను భూమిని  కొనుగోలు చేశానన్న వార్తలు అవాస్తవమని.. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అవసరమైతే తాను కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి భూసేకరణ విషయంలో రాజధానిలో పర్యటిస్తానని.. రాజధాని ప్రాంతంలో తనకు అంగుళం భూమి కూడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీనే రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఔటర్ రింగు రోడ్డు కోసం తన 18 ఎకరాల భూమిని లాక్కుందని.. ఈ నేపథ్యంలోనే తను సుప్రీంకోర్టును ఆశ్రయించానని అన్నారు.

ఇదిలా ఉండగా తానే పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. భూసేకరణ విషయంలో రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని పవన్ కళ్యాణ్ చెప్పేది కరెక్ట్ అని అన్నారు. అయితే, రాజధాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులు భూమిని ఇవ్వాలన్నారు.