పవన్ కి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న ఫ్యాన్

 

విజయవాడలోని తల్వాకర్స్‌‌ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న‌ అనిల్‌కుమార్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆత్మహత్యకు ముందు అతను పవన్ కళ్యాణ్ కు లేఖ రాసాడు.. చివరి కోరికగా పవన్ తనను చూసేందుకు రావాలని, పవన్‌ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించాలని కోరాడు.. బతికుండగా పవన్‌ను చూడలేకపోయానని, తాను చనిపోయిన తర్వాత అయినా పవన్‌ తనను చూసేందుకు రావాలని, ఇదే తన చివరి కోరిక అని అనిల్‌ లేఖలో రాశాడు.. అనిల్ కు మొదటి నుండి పవన్ అంటే విపరీతమైన అభిమానం.. జనసేన చేపట్టిన అనేక కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకునేవాడు.. అయితే అతని ఆత్మహత్యకు మితిమీరిన అభిమానమే కారణమని తెలుస్తోంది.. పవన్ కళ్యాణ్ ని చూడాలని, జనసేనకు తాను ఏమి చేయలేకపోతున్నాని కుటుంబసభ్యుల వద్ద కూడా బాధపడేవాడట.. అనిల్ మృతిపట్ల కుటుంబసభ్యులతో పాటు, పవన్ అభిమానులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.