కిడ్నీ బాధితుల కోసం పవన్‌ కళ్యాణ్ దీక్ష

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం బాధితుల సమస్యిన తక్షణమే తీర్చాలంటూ పవన్‌ కళ్యాణ్‌ ఒకరోజు దీక్షకు దిగారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌‌లో ఇవాళ సాయంత్రం అయిదుగంటల వరకు ఈ దీక్ష సాగుతుంది. ఉద్దానం బాధితుల గురించి ప్రభుత్వం 48 గంటల్లోగా స్పందించకపోతే తాను దీక్షకు దిగుతానని పవన్‌ ఇంతకుముందే హెచ్చరించిన విషయం తెలిసిందే! ఉద్దానంలో హెల్త్ ఎమర్జెన్సీని విధించాలనీ, తగినన్ని నిధులు విడుదల చేయాలనీ, రాష్ట్రంలో ఆరోగ్య మంత్రిని నియమించాలనీ... ఇలా ఉద్దానంలోని కిడ్నీ బాధితుల కోసం పవన్‌ వివిధ డిమాండ్లు చేశారు. వాటికి ప్రభుత్వం స్పందించకపోవడంతో నేరుగా ఒకరోజు దీక్షకు దిగినట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu