ముగిసిన డెడ్ లైన్...పవన్ నిరాహార దీక్ష...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని... కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని..లేకపోతే దాను నిరాహారదీక్షకు దిగుతానని డెడ్ లైన్ పెట్టాడు. అయితే ఇప్పుడు ఆ గడువు ముగిసింది. అయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో పవన్ నిరాహార దీక్షకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి శనివారం సాయంత్రం ఐదు గంటల వరకూ పవన్ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. అంతేకాదు నిరాహార దీక్ష ముగిసే సమయానికి జనసేన భవిష్యత్ కార్యాచరణను కూడా పవన్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu