అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత, పరిటాల సునీత అరెస్ట్

తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు పరిటాల సునీతను పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త పరిటాల రవీంద్ర హత్య కేసుపై మళ్లీ సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆమె బుధవారం ఆమె అనంత పట్ఠణంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధమయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెబుతూ పోలీసులు ఆమె దీక్షకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసులు అనంతలో 144వ సెక్షన్ విధించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద అనుమతి నిరాకరించడంతో టిడిపి కార్యాలయం వద్ద రోడ్డుపై ఆమె బైఠాయించారు. దీంతో పోలీసులు అమెను అరెస్టు చేశారు. ఆమెతో సహా పలువురు నేతలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. సెక్షన్ 151 కింద ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనను పోలీసులు అరెస్టు చేయడంపై సునీత తీవ్రంగా మండిపడ్డారు. తాము మౌనంగా దీక్ష చేపడతామని చెబుతున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని టిడిపి తప్పు పడుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu