పారిస్ లో మళ్లీ కాల్పులు.. ఐసిస్ తో అప్రమత్తంగా ఉండాలి.. రాజ్ నాథ్ సింగ్



ఇప్పటికే అగ్రరాజ్యమైన అమెరికా.. ఇతర దేశాలకు ప్రాన్స్ కు పట్టిన గతే మీకు పడుతుందని ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పారిస్ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో యూఎస్ నుండి పారిస్ వెళ్లే రెండు విమానాలను దారి మళ్లించారు. ఇక ఐసిస్ బెదిరింపులతో పారిస్ లో పలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా పారిస్ లో మళ్లీ కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు, దుండగుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా ఇక్కడ భారత్ లో ఐసిస్ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇక్కడ కూడా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం లేకపోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హైఅలర్ట్ గా ఉండాలని.. అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.