కానిస్టేబుల్ నాగమణి హత్యకేసులో పరమేష్ రిమాండ్ 

ఇబ్రహీం పట్నం మండలం రాయపోలులో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన పరమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కులాంతర వివాహం, ఆస్తి తగాదా కారణంగా నాగమణిని ఆమె తమ్ముడు పరమేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు సహకరించిన శివ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నాగమణి తన భర్తకు విడాకులిచ్చి శ్రీకాంత్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత తన ఆస్తి వాటా అడగడంతో పరమేష్ అక్కమీద కక్ష్య పెంచుకున్నాడు. డ్యూటీ  కోసం స్కూటీపై వెళ్లిన నాగమణిని తన కారుతో ఢీ కొట్టడంతో నాగమణి పడిపోయింది.  కారులోంచి వేట కొడవలి తీసి పరమేష్  విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు.