తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

తెలుగు రాష్ట్రాలలో బుధవారం (డిసెంబర్ 4) భూమి కంపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పలు ప్రాంతాలలో  ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూప్రకంపనలు కనీసం రెండు నుంచి మూడు సెకండ్లు సంభవించినట్లు సమాచారం. తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, గోదావరి ఖని, భూపాలపల్లి, చిర్ల, చింతకాని, ములుగు, భద్రాచలంలలో భూమి కంపించింది. అలాగే ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం ప్రాంతాలలో కూడా భూమి కంపించింది. 

భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఒక్క సారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప కేం్దరం ములుగు జిల్లాలో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. భూమి లోపల 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పారు.  ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఎటువంటివ ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.