మారని పాక్ బుద్ది..

 

ఇప్పటికే పలుమార్లు కాల్పుల ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు వెంబడి ఉన్న గ్రామస్ధులు, స్కూళ్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా  నౌషెరా సెక్టార్‌లో ఉన్న స్కూళ్ల విద్యార్థులను తరలిస్తుండగా పాక్ దళాలు కాల్పులు జరిపారు. ఈ సందర్బంగా ఇండియన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ స్పందిస్తూ..పాకిస్థాన్ మేజర్ జనరల్ షాహిర్ షంషాద్ మిర్జాతో  హాట్‌లైన్ ద్వారా మాట్లాడారు. ఇక నుంచి ఇటువంటి కార్యకలాపాలకు తమవైపు నుంచి అడ్డుకట్ట వేయాలని.. తమ దళాలను నియంత్రించాలని కోరినట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu