‘బేబీ’పై పాక్ నిషేధం

 

తీవ్రవాదానికి వ్యతిరేకంగా అక్షయ్ కుమార్ హీరోగా, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, అనుపమ్ ఖేర్, డానీ డెంజోప్పా, కేకే మీనన్ ఇతర ప్రధాన పాత్రధారులుగా నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ‘బేబీ’ సినిమా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమాని పాకిస్థాన్ నిషేధించింది. దీంతో ఈ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కాదు. ఈ సినిమాని పాకిస్థాన్‌లో విడుదల చేయడానికి ముందు సెన్సార్ సభ్యులు చూశారు. అనంతరం వారు ఈ చిత్రాన్ని పాకిస్థాన్‌లో ప్రదర్శించడానికి వీలు లేదంటూ నిషేధించారు. ఈ సినిమాలో టెర్రరిస్టు పాత్రలకు ముస్లిం పేర్లు ఉన్నందువల్ల నిషేధించామని వారు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu