కొనసాగుతున్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్ట్ పర్వం 

ఎపిలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నేతలే టార్గెట్ గా వైసీపీ సోషల్ మీడియా చెలరేగిపోయింది. చివరకు వారి కుటుంబ సభ్యులను వదల్లేదు. అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, వ్యక్తిగత దూషణలతో నానా అరాచకం సృష్టించింది.  ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన కూటమిప్రభుత్వం మరికొందరిని అరెస్ట్ చేయనుంది. ఈ మేరకు  కడప జిల్లాలో పలువురికి 41 ఎ నోటీసులు జారి చేసింది.  నోటీసులు అందిన వారిలో  కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా ఉన్నారు.  రాఘవరెడ్డి స్వంత గ్రామంలోని నివాసానికి నోటీసులు అంటించారు. రాఘవరెడ్డితో బాటు కడప వైకాపా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న పలువురికి నోటీసులు సర్వ్ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల సారాంశం.