నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పున: ప్రారంభం

ఎపిలో ఎన్టీఆర్ వైద్య సేవలు యదాతధంగా అమలు కానున్నాయి. వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం( ఆశా)  ప్రకటించింది. ప్రభుత్వం అత్యవసర చర్చలు జరిపి వైద్య సేవలు పునరుద్దరించింది. రూ 500 కోట్ల బకాయలను చెల్లించడానికి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారి చేయడంతో ఈ ప్రతిష్టంభన ముగిసింది.  మంగళవారం  ఎన్టీఆర్ వైద్య సేవలు పున: ప్రారంభమయ్యాయి.  రూ 3, 500 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని ఆశా ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అనంతరం  ఈ ప్రతినిధులు వైధ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబుతో చర్చలు జరిపారు. మంగళవారం తక్షణ సాయం క్రింద రూ 500 కోట్లు విడుదల చేస్తున్నట్టు కృష్ణబాబు ఆశ ప్రతినిధులకు హామి ఇచ్చారు. దీంతో ఆశ సంఘం వైద్య సేవలను పున:రుద్దరించాలని నిర్ణయం తీసుకుంది.