నాడీ పతితో ఫ్యాటీ లివర్ ను తగ్గించవచ్చా ?

ఆశలు ఈ మధ్యకాలం లో అందరినీ వేదిస్తున్న మరో పెద్ద సమస్య ఫ్యాటీ లివర్ అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఫ్యాటీ లివర్ ను ఏ విధంగా తగ్గించుకోవచ్చు.ఫ్యాటీ లివర్ ప్రమాదకరమా అన్న సందేహాలు నేడు వస్తున్నాయి,అసలు ఫ్యాటీ లివర్ నియంత్రణ కు చర్యలు ఏమిటి?ఎలా తగ్గించుకోవచ్చు?ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏమిటి? ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయా? నాడీ పతిలో ఏవిధమైన ట్రీట్మెంట్ ఉంది. ఇలాంటి సమస్యలకు నాడీ పతిలో ఎలాంటి చికిత్చ ఉందొ ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు తెలుగు వన్ కు వివరించారు.ఫ్యాటీ లివర్ అంటే శరీరంలోని కాలేయానికి సంబందించిన సమస్య. హెపటైటిస్ కు సంబందించిన వ్యాధి. కాలేయం లో కొద్దిగా కొవ్వు అనేది సహజం.అయితే కొవ్వు 5 నుండి1౦ శాతం పెరిగిందో ప్రమాదమే, కాలేయపు బరువు పెరిగి ఫ్యాటీ లివర్ కు కారణం అవుతుంది. అది ప్రమాదకర స్థితికి దారి తీస్తుంది.మనం తీసుకునే ఆహారాలు,పానీయాలను జీర్ణం చేసి,ప్రోటీనులు విటమిన్లను గ్లూకోజ్ గా మార్వ్హడం తో పాటు రక్తం లోని మలినాలను తొలగిస్తుంది. 

అలాగే హేమగ్లోబిన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది.ఫ్యాటీ లివర్ సమస్య రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్య పానం ఎక్కువ చేసే వారిలో ఫ్యాటీ లివర్ సమస్యలు ఏర్పడతాయి.అయితే కొన్ని సందర్భాలలో మధ్యం తాగని వారిలో ఊబకాయం మరియు చక్కెర వ్యాధితో ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాతిలివేర్ వ్యాధి ఉన్న వారిలో ఆకలిలేకపోవడం వాంతులు,వికారం,పోట్టలోనొప్పి వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో కామెర్లు వ్యాధి కూడా ఫ్యాటిలివర్ కు కారణం అవుతుంది. ఫ్యాటీ లివర్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల పేగుల్లో రక్త శ్రావం లివర్ క్యాన్సర్ మానసికంగా మార్పులు లివర్ ఫేయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.శరీరక పరీక్ష రక్త పరీక్ష లు, అల్ట్రాసౌండ్,స్కాన్ వంటి పరీక్షలు చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించవచ్చు.

ఫ్యాటీ లివర్ సమస్యకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి...

ఫ్యాటీ లివర్ సమస్యకు కొలస్ట్రాల్ అధిక బరువును తగ్గించుకోవడం షుగర్ లెవెల్స్ నియంత్రణ లో ఉంచుకోవడం ముఖ్యం.శరీరం లోని కొవ్వు శాతాన్ని తగ్గించుకోవడం మధ్యపానాన్ని వదిలివేయడం లేదా తగ్గించుకు కోవడం ధాన్యాలు,తాజా పళ్ళు ఎక్కువగా శాఖాహారం తీసుకోవడం ముఖ్యం.ప్రత్ర్హిరోజూ కనీసం ముప్ఫై నిమిషాలు వ్యాయామం చేయడం ,లేదా నిపుణులు సూచనల ప్రకారం వేడి నీళ్ళు తాగితే ఫ్యాతీలివేర్ అనేది సహజంగానే తగ్గవచ్చు. ఫ్యాటీ లివర్ కు అక్యు ప్రెషర్ పాయింట్స్ వచ్చి మన చేతుల్లో ఉన్న ఈ పాయింట్స్ ఎక్కువగా ప్రెజర్ చేయడం వల్ల కూడా ఈ సమస్యనుండి మనం కొంతమేర బయట పడి తగ్గించు కునే  అవకాసంఉందని నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు స్పష్టం చేసారు.నాడీ పతి ద్ఫారా ఫ్యాటీ లివర్ సమస్యకు అద్భుతమైన ట్రీట్మెంట్ విధానం ఉందని ఇందుకోసం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అతి ప్రాచీన మైన తెరఫీ విధానాల ద్వారా అతి తక్కువ రోజుల్లోనే పూర్తిగా ఫ్యాటీ లివర్ ను తగ్గించవచ్చని ఈ చికిత్చద్వారా భవిష్యత్తులో వచ్చే లివర్ సమస్యలకు పూర్తిగా అరికట్ట వచ్చు అని కృష్ణం రాజు.పేర్కొన్నారు.