విశాఖ ఓటర్లు.. జగన్‌కి మొట్టికాయలు!

మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన జగన్నాటకం అట్టర్ ఫ్లాపైంది. నా వైజాగో.. నా వైజాగో అని జగన్ లబలబ నెత్తీనోరూ కొట్టుకున్నాడు. ఆరు నూరైనా వైజాగే శాసన రాజధాని అన్నాడు. ఈసారి ప్రమాణ స్వీకారం వైజాగ్‌లోనే చే్స్తాన్నాడు.. డామ్ అన్నాడు.. డుష్ అన్నాడు.. చివరికి తుస్ అన్నాడు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే జగన్ పిల్ల చేష్టలకి, మూడు రాజధానుల కుప్పిగంతులను వైజాగ్ ఓటర్లు మొట్టికాయలతో చక్కదిద్దారు.

విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు వున్నాయి. వీటిలో ఎనిమిది స్థానాలు వైజాగ్ పరిసరాల్లోనే వున్నాయి. ఈసారి జరిగిన ఓటింగ్‌ని బట్టి చూస్తే, విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్లో కూటమి గెలవబోతోందని, మిగతా మూడు స్థానాలతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది. 

భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, చోడవరం, అనకాపల్లె, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం స్థానాల్లో కూటమి గెలుస్తున్నట్టు సమాచారం. మాడుగుల, అరకు లోయ, పాడేరు స్థానాలు మాత్రం వైసీపీ అకౌంట్లో పడనున్నాయని తెలుస్తోంది. మొత్తమ్మీద విశాఖలోగాని, విశాఖ పరిసరాల్లోగానీ వైసీపీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. జగన్ మూడు రాజధానుల విధానాన్ని వైజాగ్ ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారనేదానికి ఈ ఒక్క ఉదహరణ చాలు.

ఈ ఐదేళ్ళలో జగన్ వైజాగ్‌ని విధ్వంసం చేసేశారు. జగన్‌కి సంబంధించిన పులివెందుల బ్యాచ్‌లు వైజాగ్‌ని భయాందోళనలకి గురిచేశాయి. రాజధాని వద్దు.. ఏమీ వద్దు.. ఈ జగన్ పీడ వదిలిపోతే చాలురా నాయనా అని వైజాగ్ ఓటర్లు భావించారని పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమైపోతోంది. టేక్ రెస్ట్ ఇన్ పులివెందుల జగన్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu