నేటికి సరే... రేపటికి ఏమో....!
posted on Oct 4, 2012 7:28AM
.png)
దేశ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ పుట్టింది. ఆ పార్టీ పేరు త్వరలో వెల్లడికానుంది. అయితే ఆ పార్టీ పెట్టింది ఎవరో కాదు అవినీతిపై అన్నా హజారేతో కలసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్న ఆయన బృందంలోని ప్రముఖులు అరవింద్ కేజ్రీవాల్. ఆయనతో పాటు మరికొందరు కలిసి ఇంకా పేరునిర్ణయించని పార్టీని పెట్టారు. భవిష్యత్ ఎన్నికల్లో పోటీచేస్తుందని, అన్నాహాజారేకు తనకు మధ్య విభేదాలు లేవని, మంచి అభ్యర్ధులకు మద్దతిస్తానని హజారే చెప్పారన్నారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘క్రేజీవాల్ కొత్తపార్టీని ప్రారంభించారని మీడియా పేర్కొంటోంది. కాని ఇది నా పార్టీ కాదు. మీ పార్టీ... ఇది ప్రజల పార్టీ. అన్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెబుతూ ‘గెలుస్తామా ఓడిపోతామా అన్నది నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను పోరాడకపోతే ఒక అవకాశాన్ని వృధాచేశానని భవిష్యత్‌లో నా పిల్లలు నిందిస్తారు’ అన్నారు. ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా, అవినీతిరహితంగా పనిచేసే పార్టీ అవసరం. ఇప్పటివరకు అవినీతిపై నిస్వార్ధంగా హజారేతో కలిసి పోరాడి ఇప్పుడు రాజకీయపార్టీ పెట్టిన క్రేజీవాల్ ఓ రాజకీయపార్టీ అధినేతగా అదే అవినీతిపై ఎంతవరకు పోరాడగలరన్నది సామాన్యులను సైతం వేధిస్తున్న ప్రశ్న! రాబోయే కాలంలో ఈ పార్టీ మిగతా అన్ని పార్టీల్లా కాకుండా తన ప్రత్యేకతను నిలుపుకుంటుందో... ఆ పార్టీల సరసన చేరుతుందో... రాబోయే ఎన్నికల దాని భవితవ్యం నిర్ణయిస్తాయి. నేటి రాజకీయాలు వీరే గనుక ఇప్పుడుంటే... ధర్మరాజును అవినీతిమంతునిగా చేయగల నేర్పు, హరిశ్చంద్రచక్రవర్తితో సైతం అలవోకగా అబద్ధాలు ఆడిరచగల చాకచక్యం ఈనాటి రాజకీయాలకు ఉన్నాయి. అందుకే రాబోయే పార్టీపై సామాన్యుడి సందేహం..