బీజేపీకి కొత్త అర్థం చెప్పిన లోకేష్
posted on Jun 30, 2018 12:01PM
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి ఒక వైపు బీజేపీ మరో వైపు విపక్షాల నుండి విమర్శలు, ఆరోపణలు బాగా ఎదురవుతున్నాయి.. వీటన్నింటికి కలిపి ఏపీ మంత్రి నారా లోకేష్ అదిరిపోయే కౌంటరిచ్చారు.. శుక్రవారం కాకినాడ ధర్మపోరాట దీక్ష సభలో మాట్లాడిన లోకేష్.. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలపై మండిపడ్డారు.. విభజన హామీలు నెరవేరుస్తారనే ఉద్దేశంతోనే బీజేపీతో జతకట్టామని, ప్రత్యేక హోదా ఇస్తారని నాలుగేళ్లు వేచి చూశామని, నెరవేర్చకపోగా చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏపీలో బీజేపీకి ఎప్పుడూ సీన్ లేదని, టీడీపీ పొత్తు వల్లే ఇక్కడ కనీస ఉనికి లభించిందని అన్నారు.. ఎన్‌డీఏ నుంచి టీడీపీ ఎందుకు వైదొలగాల్సి వచ్చిందో పవన్‌కు తెలీదా.. ఎన్‌డీఏలో టీడీపీ ఉ న్నంత కాలం సీఎం చంద్రబాబు మచ్చలేని నేత అని పొగిడిన పవన్‌కు ఇప్పుడు ఏమైందని లోకేష్ ప్రశ్నించారు.. టీడీపీపై, సీఎంపై అర్థరహిత ఆరోపణలు చేస్తున్న పవన్, జగన్‌లకు దమ్ము, ధైర్యం ఉంటే మోడీని నిలదీయాలని లోకేష్ సవాల్ విసిరారు.. ఏపీలో బీజేపీ అంటే 'భారతీయ జగన్ పవన్ పార్టీ' అని కొత్త అర్ధం చెప్పి లోకేష్ అదిరిపోయే కౌంటరిచ్చారు.