నేషనల్ హెరాల్డ్.. సోనియా, రాహుల్ ఏం చేస్తారో..?

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ  అధినేత్రి సోనియాగాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 19వ తేది అంటే శనివారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో కోర్టుకు హాజరైన తరువాత సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ ఇంటికి వెళతారా? లేక జైలుకు వెళతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటారు.. కానీ రాహుల్ గాంధీ మాత్రం జైలుకు వెళ్లడానికి రెడీ కానీ బెయిల్ కు దరఖాస్తు చేసేది లేదని గతంలోనే డిసైడ్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏన్డీఏ ప్రభుత్వం విధి విధానాలను ఎండగట్టే దిశగా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని సోనియా, రాహుల్ పార్టీ వర్గాలతో అన్నట్టు సమాచారం. అంతేకాదు అలా జైలుకి వెళ్లి ప్రజల సానుభూతిని మరింతగా కొట్టేయాలనే భావనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రాహుల్, సోనియాల కేసు వాదించనున్నారు. ఈ నేపథ్యంలో లాయర్లు ఏం చెబితే సోనియా, రాహుల్ అది చేస్తారని పార్టీ నేతలు తెలుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో శనివారం వరకూ ఆగాల్సిందే.