ఆశా వర్కర్ల ఆశ నెరవేరెనా..?
posted on Dec 17, 2015 4:50PM

తమ కనీస వేతనాలు రూ. 15 వేలు చెల్లించాలని ఆశా వర్కర్లు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ వారి సమస్యకు మాత్రం ఇంతవరకూ పరిష్కారం దొరకలేదు. పోనీ వాళ్లు కోరేది ఎమన్నా ప్రభుత్వాలు ఇవ్వడానికి కష్టతరమైనదా అంటే కాదు.. విద్యార్హతలు కలిగి అర్హులు అయిన వారిని రెండో ఏఎన్ ఎంగా తీసుకోవాలని - పింఛను - గ్రాట్యుటీ - ప్రసూతి సెలవులను కేటాయించాలని..ఇక గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లడం తీసుకు రావడం చేస్తుంటారు. ఇందుకు టీఏ - డీఏ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాద బీమా కల్పించాలని ప్రసూతి సేవల పారితోషికం పెంచాలని కోరుతున్నారు. నిజానికి ఇవన్నీ పెద్ద ప్రతిపాదనలు కాదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుకు నెలకు వేలకు వేలు చెల్లించే వారికి ఇది పెద్ద విషయమే కాదు. కానీ వీరి సమస్యను పరిష్కరించేవారు లేరు.
ఇక ఈవిషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత అప్పట్లో తమ సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తామని చెప్పింది కానీ అప్పటినుండి ఇప్పటి వరకూ దాని గురించి మాట్లాడింది లేదు. పోనీ ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా అంటే లేదు.. కేంద్రం కూడా పట్టించుకోవడంలేదు. ఎవరో ఒకరు పరిష్కరిస్తారులే అని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేతులు కట్టుకొని చూడటం వల్ల ఈ సమస్యకు అలాగే కొనసాగుతుంది. వారు ఇంకా ఆందోళనలు చేస్తున్నారు. మరి వారి సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో కాలమే సమాధానం చెప్పాలి.