జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 5

వైసీపీ నాయకుడు జగన్‌ని ఆవహించిన ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అలియాస్ ‘నార్సీ’కి సంబంధించిన మరికొన్ని లక్షణాల విశ్లేషణ....

‘యానిమల్’ సినిమాలో చూశాం.. హీరోయిన్ వెళ్ళిపోతూ వుంటే, హీరో వెంటపడి కాళ్ళు పట్టుకుంటూ వుంటాడు. వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్‌కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు. జగన్ ఎంత నీచానికి దిగజారాడంటే, తనను వ్యతిరేకించిందనే కారణంతో తన సొంత చెల్లిని అందరిచేతా తిట్టిస్తున్నాడు. కేరెక్టర్ లేని మనుషులు కూడా షర్మిలని తిడుతూ వుంటే విని ఆనందిస్తున్నాడు. సమాజంలో ఎంతమాత్రం విలువలేని వాళ్ళని సాక్షి టీవీలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు తీసుకుంటూ వుంటారు. వాళ్ళు జగన్‌ని వ్యతిరేకించే వాళ్ళని అసహ్యంగా తిడుతూ వుంటారు. సొంత చెల్లి కట్టుకున్న చీర మీద కూడా మాట్లాడే పరిస్థితికి ‘నార్సీ’ జగన్ దిగజారిపోయాడు. 

వివేకానందరెడ్డి హత్య కేసులో ముందు గుండెపోటు అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు చేశాడంటూ నారాసుర రక్తచరిత్ర పేరుతో కథనాలు వండి వార్చారు. ఇప్పుడు ఆయనకి మరో పెళ్ళి జరిగిందని, ఆమె తరఫు వాళ్ళు చంపి వుంటారని,  ఇంకోసారి ఆయన కూతురు, అల్లుడే చంపించారని.. ఇలా రకరకాలుగా ఆ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు. 

జగన్ ఇన్ని దారుణాలు చేస్తూ వున్నా కూడా ప్రజలు జగన్ విషయంలో పూర్తిగా అర్థం కానట్టు ఎందుకు వున్నారంటే, అదే ఈ ‘నార్సీ’ విధానంలో వున్న మాయ. ఈ మాయ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటపడాలి. ఈ నార్సీల పోకడ గురించి మనకి పూర్తిగా తెలియపో్తే ఆ ఉచ్చులో మనం చిక్కుకుపోతాం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కష్టం. (సమాప్తం).