సైకిల్ కావాలంటే ఫ్రూవ్ చేసుకోండి... ములాయం, అఖిలేశ్ కు ఈసీ డెడ్ లైన్..
posted on Jan 5, 2017 1:26PM

ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీలో చీలకలు ఏర్పడిన నేపథ్యంలో పార్టీ గుర్తుపై పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, కొడుకు అఖిలేశ్ యాదవ్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ గుర్తు మాదే అంటూ.. మాదే అని ఇరు వర్గాల నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ గుర్తు నేపథ్యంలో ములాయం, అఖిలేశ్ పై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఏకంగా ఢిల్లీ కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు పార్టీ గుర్తుపై ఈసీ తండ్ర్రీ, కొడుకులకు డెడ్‌లైన్ విధించింది. సైకిల్ కావాలంటే మీ మెజారిటీ నిరూపించుకోండి అంటూ వచ్చే సోమవారం వరకు గడువునిచ్చింది. దీంతో మెజార్టీ నిరూపించుకోవాలని ఈసీ ఆదేశించడంతో ఆ పనిలో పడ్డాయి ములాయం, అఖిలేష్ వర్గాలు. దీనిలో భాగంగా ఇప్పటికే అఖిలేశ్ తనకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ పదవుల్లో ఉన్నవారిని ఈరోజు సమావేశానికి ఆహ్వానించారు. ఆ సమావేశంలోని వారి సంతకాలు తీసుకొని వాటిని ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. దీనికి తోడు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవ్వడంతో గుర్తు కోసం పోరు ఉద్ధృతమైంది. మరి ఎవరికి ఎక్కువ మెజార్టీ దక్కుతుందో... ఎవరు సైకిల్ గుర్తు సొంతం చేసుకుంటారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.